జంక్‌ఫుడ్‌తో అనారోగ్యం
సీసీడీఓ చంద్రకళ
వేములపల్లి, మే 25: గర్భిణీ, బాలింతలు జంక్ ఫుడ్ తీసుకోవడం వలన ఆరోగ్యం పాడవుతుందని సిడిపిఓ చంద్రకళ అన్నారు. సోమవారం వేములపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు తల్లులకు పోషకాహారం పట్ల అవగాహన కల్పించారు. గర్భిణీలకు హెచ్. పి టెస్టులు నిర్వహించారు. పోషకాహార స్టాల్ ఏర్పాటు చేసి తల్లులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువల గురించి వివరించారు.
ఈ సందర్భంగా సిడిపిఓ చంద్రకళ మాట్లాడు తూ. చిన్నపిల్లలు గర్భిణీలు పోషకాలతో కూ డిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఉప్పు చక్కెర నూనె అధికంగా వాడకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సందీప్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుచరిత, మండల విద్యాధికారి లక్ష్మ ణ్ నాయక్, సిహెచ్‌ఓ ప్రవీణ్ ,హెల్త్ సూపర్వైజర్ శాంతా, అంగన్వాడి సూపర్వైజర్ పరి మి రజిని, ఏఎన్‌ఎం లు శైలజ, కవిత అంగన్వాడీ టీచర్స్ , ఆశా వర్కర్స్ ,అంగన్వాడి ఆయాలు తదితరులు పాల్గొన్నారు.






