calender_icon.png 3 November, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంటాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

02-11-2025 08:43:13 PM

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి..

పెద్దపల్లి జిల్లా సీఐటీయూ అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి..

గోదావరిఖని (విజయక్రాంతి): కాంటాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం(సీఐటీయూ) అర్జీ-1 జనరల్ బాడీ సమావేశంలో ఉపేందర్ అధ్యక్షతనలో పాల్గొన్న సీఐటీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు చాలీచాలని వేతనాలతో కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.

వీటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం పట్టించుకోక పోగా, కార్మికులపై తీవ్రమైన భారాలను మోపుతున్నారని అన్నారు. అదేవిధంగా కార్మికులకు రావలసిన సీఎంపీఎఫ్ చిట్టీలు 2021 వ సంవత్సరం నుంచి ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా దారుణమని, అసలు సీఎంపిఎఫ్ కార్మికులకు కట్ చేస్తున్నారో, చేయడం లేదో, సీఎంపిఎఫ్ లో జమ అవుతున్నాయో లేదో అనే భయాందోళనకు కార్మికుడు గురవుతున్నారి, ఈ మధ్యనే సీఎంపిఎఫ్ కమిషనర్ ను సిఐటియు నాయకత్వం కలిసి ఈ సమస్య గురించి మాట్లాడగా ఆర్జీ-2 అర్జీ-3 లో పెండింగ్ లేకుండా ఉన్నాయని, ఒక ఆర్జీ-1లో మాత్రమే పెండింగ్ ఉన్నాయని దానికి కారణం సింగరేణి యాజమాన్యం అని చాలా స్పష్టంగా చెప్పారని, ఇప్పటికైనా సింగరేణి అధికారులు ఈ సమస్య ప్రాధాన్యతను గుర్తించి వెంటనే కాంట్రాక్టు కార్మికులకు కట్ చేసిన సీఎంపీఎఫ్ సొమ్మును వెంటనే సీఎంపిఎఫ్ కు జమ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.

అదేవిధంగా కన్వేయన్స్ వెహికల్ డ్రైవర్లకు పెండింగ్ లో ఉన్న సీఎంపిఎఫ్ సమస్యను పరిష్కరించి వెంటనే దాన్ని డ్రైవర్లకు అందజేసే విధంగా చొరవ చూపాలని అన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు ఇంకా హెచ్ డి ఎఫ్ బ్యాంకులో అకౌంట్ ప్రారంభించని, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికుల కుటుంబ సభ్యులందరికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని దానికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యమే వహించాల్సి ఉంటుందని అన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా సిహెచ్. ఉపేందర్, వేల్పుల కుమారస్వామి, కోశాధికారిగా ఇండ్ల ఓదెలు, ఉపాధ్యక్షులుగా పొనగంటి రవి, దాసరి స్వప్న, సహాయ కార్యదర్శిలుగా రాజు లతో పాటు 11 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.  ఈ కార్యక్రమంలో కార్మికులు సంధ్య, శేకర్, నరేష్, అంజయ్య, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.