02-11-2025 08:44:07 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం అశేష భక్తజనం మధ్య ఘనంగా తులసీ పూజ నిర్వహించారు. దేవస్థాన అర్జకులు సతీష్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో వైభవంగా పలు జంటలతో తులసి పూజలు చేశారు. రాజరాజేశ్వరునికి భక్తితో అన్న సమర్పణ నిర్వహించారు.అనంతరం మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించారు. పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.