15 June, 2026 | 8:13 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

పాలమూరు ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి

03-06-2026 08:35 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ శ్వేత పత్రం విడుదల చేయాలని బిఎస్పి జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాబుజగ్జీవన్ రామ్ భవన్ లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ప్రాంత భూముల కోల్పోయిన నిర్వాసితులకు నేటికీ పరిహారం పూర్తి స్థాయిలో అందడం లేదని, ప్రాజెక్టు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడంతో కృష్ణ బేసిన్ నీటి వాట వినియోగించుకోలేకపోతున్నామన్నారు. ఆయా రాజకీయ పార్టీలు సైతం రాజకీయ పబ్బం కోసం ప్రాజెక్టును వాడుకుంటున్నారని చిత్తశుద్ధితో ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వారితోపాటు కొల్లాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు బొల్లి కురుమయ్య, పార్లమెంట్ ఇంచార్జ్ లు మిద్దె మహేష్, కళ్యాణ్, ఉమ్మడి జిల్లా పార్లమెంట్ జోన్ ఇంచార్జ్ పృథ్వీరాజ్ పాల్గొన్నారు.