calender_icon.png 23 February, 2026 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్ల ట్యాంకర్‌ను ఢీకొట్టిన కంటైనర్

23-02-2026 11:05:54 AM

 క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ 

క్లీనర్ కు స్వల్ప గాయాలు

సంగారెడ్డి,(విజయక్రాంతి): నీళ్ల ట్యాంకర్ ను కంటైనర్ ఢీ కొట్టడంతో డ్రైవర్ కు, క్లీనర్ కు తీవ్ర గాయాలైన సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా చౌటకూర్ మండలం  శివంపేట బీర్ ఫ్యాక్టరీ వద్ద ఎన్ హెచ్ 161 రోడ్డుపై జరిగింది. జాతీయ రహదారిపై చెట్లకు నీళ్లు పడుతున్న ట్యాంకర్ ను కంటైనర్ అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో క్యాబిన్ లో ఇరుక్కున్న కంటైనర్ డ్రైవర్ మజీల్ ని స్థానికులు బయటకు తీశారు. కాగా క్లీనర్ మహమ్మద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.  ఇద్దరిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.