24 August, 2026 | 11:28 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం

28-06-2026 01:33 AM
  1. మంత్రి  ధనసరి సీతక్క
  2.   14 నైబర్ హుడ్ సెంటర్లకు ఈ--ఆటోల పంపిణీ 

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు.  హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా శనివారం రాష్ట్రంలోని 14 నైబర్ హు డ్ సెంటర్లకు ఈ--ఆటోలను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  దివ్యాంగులను జాలి చూపాల్సిన వారిగా కాకుండా సమాజ అభివృద్ధిలో సమాన భాగస్వాములుగా చూడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌డ్డి నాయకత్వంలో దివ్యాంగు లకు విద్య, ఉపాధి, పునరావాసం, జీవనోపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పి స్తున్నామని చెప్పారు. సెర్ప్ సీఈఓ దివ్యాదేవరాజన్, డైరెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తక్కువ కాలంలోనే దివ్యాంగులను సంఘటితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 13 వేలకుపైగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడం అభింనదనీయమన్నారు.

ప్రస్తుతం 26 జిల్లాల్లో 74 నైబర్ హుడ్ సెంటర్ల ద్వారా కమ్యూనిటీ మేనేజ్డ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కార్యక్రమాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైబర్‌హుడ్ సెంటర్లలో దాదాపు మూడు వేల మంది దివ్యాంగ పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ప్రత్యేక విద్య, కౌన్సెలింగ్, నైపుణ్యాభివృద్ధి వంటి సేవలు అందుతున్నాయని మంత్రి వివరించారు. 

నైబర్‌హుడ్ సెంటర్లను మరింత బలోపేతం చేస్తామని, అవసరమైన చోట కొత్త కేంద్రా లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభి వృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషో ర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, సెర్ప్‌లో దివ్యాంగుల సంక్షేమ విభాగ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు పీయూష్ మిట్టల్, కైలాష్, అధికారులు, దివ్యాంగులు, వారి కుటుంబ స భ్యులు పాల్గొన్నారు.