calender_icon.png 7 February, 2026 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవి కాదు ప్రజా సేవే నా లక్ష్యం..

07-02-2026 01:43:19 AM

  1. అభివృద్ధి నా బాధ్యత, సమస్యల పరిష్కారానికి కృషి

11వ వార్డు స్వతంత్ర అభ్యర్థి పెండల మహేష్

జిన్నారం/అమీన్ పూర్, ఫిబ్రవరి 6 :గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారం 11వ వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే తన ఏకైక ధ్యేయమని స్వతంత్ర అభ్యర్థి పెండల మహేష్ పేర్కొన్నారు. మీ వెంటే నేను ఉంటాను... సోదరుడిగా ఆదరించండి అంటూ ప్రజలను ఆయన భా వోద్వేగంగా అభ్యర్థించారు. అధికార కాంగ్రెస్,బిఆర్‌ఎస్ పార్టీలు హామీలకే రిమితమవుతున్నాయని, కానీ తాను ప్రజల మధ్య నుంచే వచ్చిన వ్యక్తినని తెలిపారు.

వార్డులో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల సమస్యలు, తాగునీరు, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల కొరత వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని పెండల మహేష్ హామీ ఇచ్చారు. ప్రజలతో నిరంతర సంప్రదింపులు జరిపి, ప్రతి వీధి సమస్యను గుర్తించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తానన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రజల ఆశయాలకే ప్రాధాన్యం ఇస్తానని, పదవి కాదు సేవే తన లక్ష్యమని స్పష్టంచేశారు.

యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల భద్రత, పాఠశాలలు మరియు ఆరోగ్య సదుపాయాల అభివృద్ధి తన ప్రాధాన్యాల్లో ఉంటా యని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నతనకు యాపిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మహేష్ కోరారు. మీ ఆశీర్వాదంతో వార్డును అభివృద్ధి దిశగా నడిపిస్తాను అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లింగం, ఎల్లయ్య, జగన్, కుమార్, బజ రంగ్ సింగ్, రామకృష్ణ, దేవేందర్, వెంకటేష్, గోవింద్, గణేష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.