11 June, 2026 | 2:15 AM

సామాన్యులపై భారం వేసేందుకే వంట గ్యాస్, పెట్రోల్,డీజిల్ ధరలు పెంపు

11-06-2026 12:18 AM

చాడ వెంకటరెడ్డి 

ముకరంపుర, జూన్ 10 (విజయ క్రాంతి): సామాన్య, పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారం వేసి ఎందుకే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని, దేశం అప్పుల ఊబిలోకి కోరుకుపోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ కారణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. వంట గ్యాస్, పెట్రోల్,డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ బుధవారం సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపిడివో కార్యాలయం చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై రోజు రోజుకు పెనుభారం మోపుతుందని, విచ్చల విడిగా వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందని, ధరలు పెరగడం వల్ల ప్రజల జీవనప్రమాణలపై ఆ ప్రభావం పడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, టేకుమల్ల సమ్మయ్య,బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.