కూతురే కొడుకై..!
11-06-2026 12:18 AM
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
సంస్థాన్ నారాయణపూర్, జూన్ 10: కొడుకులు లేని తండ్రికి తానే కొడుకై అంత్యక్రియలు నిర్వహించిన ఘటన నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. లింగవారిగూడెం గ్రామానికి చెందిన చిట్యాల సతిరెడ్డి(77)కి ఒక్కతే కూతురు. కుమారులు లేరు.
గుండెపోటుతో మరణించిన సతిరెడ్డికి కూతురు పల్లె సరళ అంత్యక్రియలు నిర్వహించి తలకొరివి పెట్టి కొడుకులు లేని లోటు తీర్చింది. పల్లె సత్తిరెడ్డి మృతికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన పార్థీవ దేహంపై ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఉజ్జిని యాదగిరి రావు,ప్రజా ప్రతినిధులు,వివిధ రాజకీయ పార్టీల నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.






