29 March, 2026 | 6:00 PM

ప్రజలకు నాగరికత నేర్పింది హిందూ సమాజమే

29-03-2026 04:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రపంచానికి నాగరికత పరిచయం చేసిందే హిందూ సమాజమేనని హిందూ ధర్మిక సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణలోని బుధవార్ పేట్ వివేక్ నగర్ బాస్తీ హిందూ సమ్మేళనం పట్టణంలోని మున్నూరుకాపు సంఘ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, నూకల విజయ్ కుమార్, రఘునందన్ రెడ్డి సుధాకర్ మాట్లాడుతూ... ప్రపంచంలో మొట్టమొదటి మతం హిందూ మతమని చరిత్ర చెపుతుందన్నారు.

అప్పటి నుండి నేటివరకు హిందూ మతాన్ని ఎవరేమి చేయలేదని మన ధర్మమే మనకు రక్షణగా ఉంటుందన్నారు.హిందూ మతాన్ని మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రతి దేశంలో హిందూ మతాన్ని విశ్వసించేవారు ఎందరో ఉన్నారన్నారు. మనం ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడే మన ధర్మాన్ని కాపాడుకున్న వాళ్లమౌతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు