calender_icon.png 5 July, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తనాల సేకరణలో కూలీలైన్ పాఠశాల ప్రథమ స్థానం

05-07-2025 12:00:00 AM

పర్యావరణం.. పచ్చదనం పై విద్యార్థులకు అవగాహన 

కలెక్టర్ వినూత్న ప్రయత్నం 

కొత్తగూడెం జూలై 4 (విజయ క్రాంతి): కొత్తగూడెం మండల స్థాయి విత్తనాల సేకరణలో రామవరం హై స్కూల్ , కూలీ లైన్ హై స్కూల్‌విద్యార్థుల్లో పర్యావరణం-పచ్చదనం, చెట్ల ప్రాముఖ్యత పట్ల అవగాహన పెంచే క్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వినూత్నంగా విత్తనాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ మేరకు కొత్తగూడెం మండలంలో రామవరం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల రామవరం, కూలీలైన్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూలీలైన్ ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆపై మండల స్థాయిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల రామవరం ప్రథమ స్థానంలో, కూలీలైన పాఠశాల ద్వితీయ స్థానంలో ఉన్నాయి. కాంప్లెక్స్ స్థాయి విజేతలకు 1000 మండల స్థాయి విజేతలకు 5000 ప్రోత్సాహకంగా కలెక్టర్ ప్రకటించారు.

జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించే వారికి 50 వేలు ప్రోత్సహంగా కలెక్టర్ ఇవ్వనున్నారు. చెట్ల పెంపకం-వాటి ప్రాముఖ్యత గూర్చి ఈ వినూత్న కార్యక్రమాన్ని విద్యార్థుల్లో అవగాహన కలిగించేలా జిల్లా కలెక్టర్ వినూత్నoగా శ్రీకారం చుట్టారు. 80 రకాలు సుమారుగా 70 Kg లా విత్తనాలను విద్యార్థులు సేకరించారు. కొత్తగూడెం మండల స్థాయి ఎంపికలో నిర్ణేతలుగా ఆనందఖని ఉన్నత పాఠశాల సీనియర్ సిబ్బంది, కూలీ లైన్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం లాలు, కొత్తగూడెం ఎంఈఓ డాక్టర్ ప్రభు దయాల్, సిఆర్పిలు మరియు ఎమ్‌ఆర్సిలు పాల్గొన్నారు.