05-07-2025 12:00:00 AM
పట్టణంలోని ముఖ్య కూడలిలో గిరిజన
మ్యూజియం వివరాలు తెలిపే బోర్డులు: ఐటిడిఏ పిఓ రాహుల్
భద్రాచలం, జులై 4 (విజయ క్రాంతి): భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం పర్యాటకులు, శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల ఆదరణతో దిగ్విజయంగా నడుస్తున్నదని మరింత ప్రాచుర్యం లోకి తేవడానికి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కళాఖండాల బ్యానర్లు రూపొందిస్తున్నామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
శుక్రవారం ట్రైబల్ మ్యూజియంనకు భక్తులు, పర్యాటకులు సులువుగా అడ్రస్ తెలుసుకుని మ్యూజియంను సందర్శించడానికి భద్రాచలం పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం, అన్నదాన సత్రం, గోదావరి కరకట్ట , భక్తులు అధికంగా బస చేసే ప్రదేశాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత తరం గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన కళాఖండాలతో రూపొందించిన ట్రైబల్ మ్యూ జియం వర్షం పడిన రోజు మినహా ప్రతిరోజు సందర్శకులు మ్యూజియంను తిలకిస్తున్నారని అ న్నారు. సందర్శకులు భక్తులు ట్రైబల్ మ్యూజియం చరిత్రను పూర్తిస్థాయిలో తెలుసుకొని సందర్శించడానికి మ్యూజియమునకు సంబంధించిన కటౌట్లు, వాటి చరిత్ర బ్యానర్స్ ముఖ్యమైన కూ డలల్లో త్వరలో అమరుస్తామన్నారు.
అనంతరం అంబేద్కర్ సెంటర్లోని మహనీయుల విగ్రహాలను సందర్శించి వాటికి ఏమైనా మరమ్మతుల అవసరమైతే చేయించి పెయింటింగ్ వేయిం చాలని ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జ నరల్ డేవిడ్ రాజ్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్, టీఏ శ్రీనివాస్, దేవస్థానం డి ఈ రవీందర్, ఇరిగేషన్ డి ఈ, ఏఈ వెంకటేశ్వర్లు, వీరభద్రం, ఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.