calender_icon.png 5 July, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ కల్లుగీతకార్మిక సంఘం మండల మహాసభలను జయప్రదం చేయాలి

04-07-2025 10:54:34 PM

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న  

చండూరు,(విజయక్రాంతి): ఈనెల 20న చండూరులో జరిగేజరిగే మునుగోడు నియోజకవర్గ మండల మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అన్నారు. శుక్రవారం గట్టుప్పల మండల కేంద్రంలో తెలంగాణ కల్లగిత కార్మిక సంఘం మండల మహాసభలకరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏర్పడ్డ సంఘం కల్లుగీత కార్మిక సంఘం అని, గీత కార్మికుల సమస్యల పట్ల నిరంతరం పోరాడేది కల్లుగీత కార్మిక సంఘం అని ఆయన అన్నారు. కల్లులో అనేక పోషక విలువలు ఉన్నాయని, క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా నివారించవచ్చు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చాలామంది గీత కార్మికులకు సేఫ్టీమొకులు ఇవ్వలేదని ఆయన అన్నారు. గీత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ కు ఎలాంటి శరత్తులు లేకుండా 50 సంవత్సరాలు ఉండిన ప్రతి గీత కార్మికునికి చేయూత పథకం ద్వారా 5000 ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేసి గీత కార్మికులకు, యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని ఆయన అన్నారు. కల్లుగీత ఫెడరేషన్ ఏర్పాటు చేసి 5000 కోట్లు బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియాను వెంటనే ఇవ్వాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కర్నాటి సుధాకర్, పెదగాని నరసింహ, వెంకటేష్ గౌడ్, వెంకటేష్, రాజు, ఖమ్మం రాములు, బుచ్చిరెడ్డి, జంగయ్య, రాములు, శంకరయ్య, బుచ్చయ్య, యాదిరెడ్డి, చంద్రయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.