సామాజిక బాధ్యతగా సహకారం
కొత్తగూడెం, (విజయక్రాంతి): తన స్థాయిలో బీదలపట్ల ప్రత్యేక ఔదార్యం చూపే కొత్తగూడెం మండల మాజీ విశ్రాంత విద్యాశాఖ అధికారి డా. ప్రభుదయాల్ ఆదివారం అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల పాత కొత్తగూడెంలోని విద్యార్థులకు ప్రత్యేక మెనూతో భోజనాన్ని అందించి వారితోనే సహపంక్తి భోజనం చేశారు. పాఠశాలలో ఆయా విద్యావసరాలు ఉన్న విద్యార్థులను గుర్తించి ఎప్పటికప్పుడు వారి అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.
తన చిన్ననాటి అనుభవాలను గుర్తుంచుకుంటూ ఇతరులు ఇబ్బంది పడకుండా తన చేతనైనంత మేర వారి విద్యాభివృద్ధికై తోడ్పటునందిస్తున్నారు. విద్యార్థులకు చదువు, పని తనాన్ని వివరించి చక్కగా చదువుకోవాలని పలు సూచనలు చేశారు. చదువు విషయంలో ఎలాంటి అవసరాలున్నా తనకు తెలియజేయాలన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు నరేష్ శంకర్లు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.




