1 March, 2026 | 7:22 PM

పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ సంబరాలు

01-03-2026 05:02 PM

ఘనంగా ఆత్మీయ సమ్మేళనం

స్నేహబంధాలు బలోపేతం

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని ఇంద్రప్రస్థ వెంచర్‌లో ఆదివారం బిబిపేట మండలం మాందాపూర్ 2000–2001 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల స్నేహ బంధాన్ని సిల్వర్ జూబ్లీగా ఘనంగా జరుపుకున్నారు. ఆత్మీయ వాతావరణంలో నిర్వహించిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉత్సాహభరితంగా సాగింది.

పావు శతాబ్దం తర్వాత కలుసుకున్న సహాధ్యాయులు పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చిన్ననాటి స్నేహాలు, గురువుల బోధనలు, ఆడిపాడిన క్షణాలను తలుచుకుంటూ నవ్వులు పూయించారు. కొందరు తమ అనుభవాలను పంచుకుంటూ జీవిత ప్రయాణంలో స్నేహం ఎంత విలువైనదో వివరించారు.కార్యక్రమం సందర్భంగా పరస్పరం సన్మానాలు, స్మృతిచిహ్నాల అందజేత, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

భవిష్యత్తులో ప్రతి ఐదేళ్లకోసారి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి స్నేహబంధాలను మరింత బలపరచాలని నిర్ణయించారు.స్నేహం అనే బంధం కాలాన్ని దాటిపోతుందని ఈ సిల్వర్ జూబ్లీ సమ్మేళనం మరోసారి చాటి చెప్పింది.ఈ కార్యక్రమంలో అంకన్న గారి గంగాధర్ గౌడ్, చింతకుంట సుధాకర్ రెడ్డి, గజ్వేల్ విజయ్ కుమార్, యాచం సంతోష్ కుమార్, గజ్వేల్ ఉదయ భాస్కర్, గురజాల సంతోష్ కుమార్, అయిత భాస్కర్, గంగమని, స్రవంతి, రజిత, సరిత, పెద్ద ధనలక్ష్మి, చిన్న ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.