06-12-2025 07:39:13 PM
- సమన్వయంతో ఏర్పాట్లు చేసుకోవాలి..
- ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష..
చిట్యాల (విజయక్రాంతి): ఈ నెల 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకునేలా, పరిష్కార మార్గం చూపాలని రామన్నపేట సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష సమక్షంలో సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి దంతూరి సత్తయ్యతో కలిసి సమన్వయ సమావేశం నిరహించారు. ఈ సమావేశంలో జడ్జి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కేసులు వేగవంతంగా పరిష్కారం అయ్యేలా అన్ని విభాగాల అధికారులు, న్యాయవాదులు, సంబంధిత సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడానికి కక్షిదారులకి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.వేంకటేశ్వర్లు, రామన్నపేట, వలిగొండ, ఎస్ఐలు డి.నాగరాజు, యుగేందర్ గౌడ్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.