calender_icon.png 6 December, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ రెండవ డిపో నుండి భద్రాచలం, పాపికొండలు టూర్

06-12-2025 07:41:00 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): తీర్థ యాత్రల టూర్ లో భాగంగా డిసెంబర్ నెలలో కరీంనగర్ రెండవ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు 12వ తేదీ శుక్రవారం రోజున కరీంనగర్ బస్టాండ్ నుండి సాయంత్రం 8.00 గంటలకు బయలుదేరును 13వ తేదీ పాపికొండలు బోటింగ్ తదుపరి అదే రోజు రాత్రి భద్రాచలం చేరును.

14th డిసెంబర్ రోజున భద్రాచలం దర్శనం, పర్ణశాల దర్శనం చేసుకొని తిరిగి అదే రోజు రాత్రి వరకు కరీంనగర్ చేరును. ఈ యాత్ర చార్జీలు బస్సు పెద్దలకు రూ.1800, పిల్లలకు రూ.1300గా నిర్ణయించబడినదని, మరిన్ని వివరాల కొరకు 9398658062, 8978383084, 9182610182 నంబర్లకు సంప్రదించలని రెండవ డిపో మేనేజర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు.