calender_icon.png 12 February, 2026 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతర విజయవంతానికి అన్ని శాఖల సమన్వయం అవసరం

12-02-2026 12:00:00 AM

  1. ఇంచార్జి కలెక్టర్ : గరిమ అగ్రవాల్

జిల్లా ఎస్పీ : మహేష్ బి. గితే

భక్తుల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం - పరిశీలన

వేములవాడ, ఫిబ్రవరి 11,(విజయాక్రాంతి)మహాశివరాత్రి జాతరను దృష్టిలో ఉంచుకొని వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జాతర రోజుల్లో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.

బుధవారం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే, వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి,అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కలిసి క్యూలైన్ల నిర్వహణ, భక్తుల ప్ర వేశనిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ సదుపాయాలు, భద్రతా చర్యలను సమీక్షించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

వీఐపీ దర్శనాల కోసం ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లను కూడా పరిశీలించి అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, వేములవాడ ఆర్డీఓ రాధాబాయి, ఈఈ రాజేష్, ఆర్‌అండ్బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, తహసీల్దార్ జయంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, టీపీఓఅన్సార్తో పాటు ఆలయ ఉద్యోగులు, అర్చకులు పాల్గొన్నారు.