బోడుప్పల్, దేవేందర్ నగర్‌లో కార్డన్ అండ్ సెర్చ్
- డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో 250 మంది పోలీసుల తనిఖీలు
పత్రాలు లేని వాహనాలు, మద్యం, గుట్కాలు, పట్టివేత
మేడిపల్లి ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మల్కాజిగిరి కమిషనరేట్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలతో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్ దేవేందర్ నగర్‌లో ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ 250 మంది పోలీస్ సిబ్బందితో నిర్వహించారు. ఈ సందర్భంగా 411 ఇండ్ల లో తనిఖీ నిర్వహించారు. పలు దుఖాణాల్లో అమ్ముతున్న 80 వేలు విలువ చేసే నిషేధిత గుట్కా,9 వేలు విలువచేసే 10 లెటర్ల మద్యం, పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్ చేశారు.
ఈ సందర్భంగా డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ నేరాల నియంత్రణ అనుమానాస్పద వ్యక్తుల కదలిక లపై పర్యవేక్షణ లక్ష్యంగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టమని, మద్యం, గుట్కాలు, పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశామని, ఒక రౌడీషీటర్ ని కూడా గుర్తించా మని, అనుమానితుల ఫింగర్ ప్రింట్స్ పరీక్షలు నిర్వహించి ఎవరికైన నేరచరిత్ర ఉన్నదో అని పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో డీసీపీ తో పాటు, అడిషన్ డీసీపీ వెంకట రమణ, ఏసీపీ లు, మోహన్ కుమార్, వెంకట్ రెడ్డి, మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి, డిఐ ఎలక్షన్ రెడ్డి, ఉప్పల్ డీసీపీ డివిజన్ పరిధిలోనీ సిఐలు, ఎస్ ఐ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




