ఉత్తమ సహకార డైరీగా ముల్కనూర్
27-02-2026 12:00 AM
భీమదేవరపల్లి, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఉత్తమ సహకార డైరీ గా ముల్కనూర్ మహిళా సహకార డైరీ అవార్డు అందుకుంది. అవార్డులు తెలంగాణ సహకార శాఖ సెక్రెటరీ సురేంద్రమోహన్ చేతుల మీదుగా ముల్కనూర్ సహకార డైరీ అధ్యక్షులు బుర్ర ధనశ్రీ, డైరెక్టర్ దొంతర వేణి రజిత అవార్డు అందుకున్నారు.
హైదరాబాదులో గురువారం జరిగిన ఎన్సీడీసీ వారు సహకార సంఘాలలో ఉత్తమంగా పనిచేసిన సంఘాలకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముల్కనూర్ మహిళా సహకార డైరీ అత్యుత్తమంగా పనిచేసినందుకు ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ క్యాబ్ ఎండి వై. కృష్ణారావు, ఎన్ సి డి సి డైరెక్టర్ సాధు జాదవ్, హైదరాబాద్ డిసిఒ రమాదేవి, నాగర్ కర్నూల్ డి సి ఓ రఘునాథరావు తో పాటు ముల్కనూర్ సహకార డైరీ పాలకవర్గం, సిబ్బంది పాల్గొన్నారు.




