దోపిడీకి గురవుతున్న ఏజెన్సీ సంపద
ములుగు,మంగపేట,ఫిబ్రవరి26(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భూమి నీరు అడవి అందులోని ఖనిజ సంపద దోపిడికి గురైతుందని మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈసం యాదయ్య మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు గురువారం నాడు మంగపేట మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి చట్టాలు అమలుకు నోచుకోక హక్కులు దక్కటంలేదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు
ఏటూరునాగారం డివిజన్ పరిధిలో తాడ్వాయి మంగపేట కన్నాయిగూడెం మండలాలలో అమాయక ఆదివాసులను మభ్యపెట్టి తక్కువ రేట్లకే నాన్ ట్రైబల్స్ భూములు కౌలు తీసుకొని జామయిల్ పామాయిల్ సాగు చేస్తున్నారని అన్నారు ఆదివాసీలు భూములని నాన్ ట్రైబల్స్ కి కౌలు ఇవ్వదని ఆయన కోరారు. ఏజెన్సీలో ప్రజలు మేల్కొని చట్టాలు అమలు కోసం ఉద్యమాలు చేయకపోతే హక్కులు దక్కవని ఏజెన్సీ సంపద దోపిడీకి గురవుతుందని ఆయన తెలియజేశారు. షెడ్యూల్ ప్రాంతంలో ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఇదే ధోరణిలో వెళ్తే ఐటీడీఏ కలెక్టరేట్ ముట్టడి చేస్తామని తెలుపుతున్నాము




