27 July, 2026 | 1:31 AM

నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్

28-07-2026 12:00 AM

డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి

కోదాడ, జూలై 26 :నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే ధ్యేయంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నా రు. ఆదివారం కోదాడ పట్టణంలోని బాలా జీ నగర్లో పోలీసులు ఆదివారం భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కోదా డ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 మోటార్ సైకి ళ్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్లో కోదాడ సబ్ డివిజ న్ పరిధిలోని ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్‌ఐలతో పాటు 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సమాజం నుండి గంజాయి మహమ్మారిని పూర్తిగా తరిమివేసి, యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలు కష్టార్జితాన్ని వృథా చేసుకోకుండా ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించారు. పట్టణంలో ఇళ్ల యజమానులు కొత్తవారికి, గుర్తింపు కార్డులు లేని వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.