calender_icon.png 3 December, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కజొన్న కొనుగోలు వేగవంతం చేయాలి

03-12-2025 12:00:00 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి

అలంపూర్, డిసెంబర్ 2: మొక్కజొన్న కొనుగోలును వేగవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం అలంపూర్ మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గన్ని బ్యాగులు లేక కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారని, అధికారుల సమన్వయ లోపంతో కాంటాలు వేసేందుకు గన్ని బ్యాగులు లేక రైతులు రోజులు తరబడి వేచి చూడవలసిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.

ఎప్పుడు వర్షం పడుతుందో అనే భయంతో రైతులు భయాందోళనలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్క్ ఫెడ్ డిఎం గారిని ఫోన్లో సంప్రదించగా రేపటి వరకు గన్నిబాగులు వస్తాయని తెలియజేశారు. అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, లేని పక్షంలో రైతులను కలుపుకొని దీర్ఘకాల పోవటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జి కే ఈదన్న, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ దేవదాసు, రైతులు ఉన్నారు.