నాచగిరి లక్ష్మీనరసింహుడికి లక్ష పుష్పార్చన
03-12-2025 12:00 AM
గజ్వేల్ డిసెంబర్ 2: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం స్వామివారి కి లక్ష పుష్పార్చన నిర్వహించారు. మార్గశిర శుద్ధ ద్వాదశి, మత్స్య జయంతి సందర్భంగా ఆలయ వేద పండితులు, అర్చకుల వేద మంత్రాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు.
కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వ హణాధికారి విజయ రామారావు మరియు చైర్మన్ రవీందర్ దంపతులు, ధర్మకర్తలు సు రేందర్ రెడ్డి దంపతులు, చందా నాగరాజు, కొత్తపల్లి శ్రీనివాస్, గాలి కిష్టయ్య, కర్రె పద్మా వెంకటేష్, సిబ్బంది సుధాకర్, నరేందర్, పాండు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




