03-12-2025 12:00:00 AM
* రేగోడు ఎస్‌ఐ పోచయ్య
రేగోడు, డిసెంబర్ 2: అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే కేసులు తప్పవని రేగోడు ఎస్‌ఐ పోచయ్య హెచ్చరించారు. మంగళవారం మండలంలోని వెంకటాపు రం గ్రామంలో వీరభద్ర హోటల్ పై పోలీసులు దాడి చేసి మధ్యం స్వాధీనం చేసుకొని హోటల్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మద్యం విలువ రూ.3,750 ఉంటుందని, అక్రమంగా మద్యం అమ్మకాలు, రవాణా చేపడితే కేసులు నమోదు చేస్తామన్నారు.