కార్పొరేట్ ఫీజును అరికట్టాలి
సామాన్య మధ్యతరగతి ప్రజలకు అధిక ఫీజుల బాధలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సం స్థలు విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వమే పూనుకొని వారి ఆగడాలను నియంత్రించాలి. ప్రతి ఒక్కరూ పైసా పైసా పోగు చేసి పిల్లల చదువులకోసం ఖర్చు చేస్తుంటారు. కేజీ విద్యకు కూడా లక్షలలో వసూలు చేస్తుండడం దారుణం.
నూతన విద్యా చ ట్టాలు అమలు చేసి అన్ని విద్యా సంస్థలలోనూ ఒకే రీతిగా ఫీజులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు, మేధావులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. రకరకాల పేర్లతో ఫీజులు గుంజుతున్నారు. ఏదో ఒక డే అని, ఫీల్డ్ వర్క్‌లు, ఎక్స్‌ట్రా క్లాసులు అనీ మరిన్ని లాగుతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల నియంత్రణ కోసం అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకురావాలి.
ముచ్కుర్ సుమన్‌గౌడ్






