31 July, 2026 | 2:25 AM

పైపులైన్ పనులు పూర్తిచేయాలి

29-05-2024 12:52 AM

ఎల్బీనగర్, మే 28 : హయత్‌నగర్ డివిజన్‌లో తాగునీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను కార్పొరేటర్ నవజీవన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్వగృహ కాలనీలో పర్యటించి, పైపులైన్ పనులను పరిశీలించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అభివృద్ధి పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పారు. హయత్‌నగర్ డివిజన్‌లోని ప్రతి కాలనీలో ప్రజలకు కావాల్సిన కనీస, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట స్వగృహ కాలనీ అసోసియేన్ నాయకులు, బీజేపీ నాయకులు ఉన్నారు.