1 July, 2026 | 11:22 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

06-06-2025 01:21 AM

నిర్మల్‌లో రెవెన్యూ అధికారులు, మేడ్చల్‌లో బిల్ కలెక్టర్లు

నిర్మల్ /మేడ్చల్, జూన్ 5 (విజయక్రాంతి): లంచం తీసుకుంటూ నలుగురు అ ధికారులు గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీలో షామీర్‌పేటకు చెందిన ఓ వ్యక్తి రెండు ఇల్లు మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు బిల్ కలెక్టర్లు రాంరెడ్డి, శ్రవణ్ రూ.20 వేలు డిమాండ్ చేశారు.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు బాధితుడు గురువారం కార్యాలయంలో డబ్బులు ఇ స్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.

నిర్మల్‌లో..

నిర్మల్ పట్టణంలోని ఓ కాలనీ చెందిన రిటైర్డ్ ఉద్యోగి తన ఇంటి అసెస్మెంట్ నంబర్ కోసం మున్సిపల్ కార్యాలయంలో దరఖా స్తు చేసుకున్నారు. పని పూర్తి కావాలంటే ఆ ర్‌ఐ సంతోష్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సోయ బ్ అహ్మద్ రూ.6,000 లంచం డిమాండ్ చేశారు. ఒప్పందం కుదుర్చుకున్న బాధితు డు ఈ విషయాన్ని ఏసీబీకి చెప్పాడు.

వారి సూచనతో గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి రూ. 6,000 లంచం ఇస్తుండగా పట్టుకున్నట్టు ఏ సీబీ డీఎస్పీ విజయకుమార్ తెలిపారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.