3 August, 2026 | 5:32 PM

Breaking News

అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..   •   జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. నాగేశ్వరరావు ఎన్నిక   •   గాజులరామారంలో రెవెన్యూ అధికారుల భారీ కూల్చివేతలు   •   స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ   •   మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి   •   తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాల విరాళం   •   ఇసుక మేటలు తొలగింపు   •   నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి   •   నవ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో దంత వైద్య శిభిరం   •   మందలపల్లి సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె   •  

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

22-06-2024 12:04 AM
  1. రూ.70వేలు తీసుకుంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

రూ.లక్ష లంచం తీసుకుంటూ సూరారం సీఐ

ఇద్దరిని రిమాండ్‌కు తరలించిన ఏసీబీ అధికారులు

జహీరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21: రాష్ట్రంలో ప్రతిరోజు ఏసీబీ దాడు లు జరుగుతున్నా అవినీతి అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ప్రతి పనికి ఓ రేటు ను ఫిక్స్ చేస్తూ దండుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. ఇందులో సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దుర్గయ్యతో పాటు మేడ్చల్ జిల్లా సూరారం సీఐ ఆకుల వెంకటేశం ఉన్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు అవినీతి అధికారులను కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించారు.  

రైతు నుంచి రూ.70 వేలు లంచం 

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా దుర్గయ్య పనిచేసున్నారు. అయితే గణేశ్‌పూర్ రైతు మల్లప్ప నుంచి రూ.70 వేల లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిమ్జ్‌లో భూమి కోల్పోయిన రైతు మల్లప్పకు పరిహారం చెక్కు కోసం రెవెన్యూ అధికారి దుర్గయ్య లక్ష రూపాయల లంచం అడిగాడు. ఈ నెల 14వ తేదీన రూ.30 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ.70 వేల కోసం రైతు కు ఒత్తిడి తీసుకురావడంతో విసిగెత్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం మిగిలిన రూ.70 వేలను ఇస్తామని రెవెన్యూ అధికారి దుర్గయ్యను గంగ్వార్ చౌరస్తాకు రమ్మని ఫోన్ చేశారు.

దీంతో రెవెన్యూ అధికారి దుర్గయ్య గంగ్వార్ చౌరస్తాలో రైతు మల్లప్పకు చెందిన కిరాణా షాపులో రూ.70 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటున్న డబ్బులను స్వాధీనం చేసుకుని న్యాల్‌కల్ తహసీల్దార్ కార్యాలయాన్ని తీసుకెళ్లి విచారించారు. అనంతరం దుర్గయ్యను రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1064 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ సూచించారు. 

రూ.లక్ష లంచం తీసుకుంటూ సీఐ 

ఓ కేసులో రూ.లక్ష లంచంగా తీసుకున్న సూరారం సీఐ ఆకుల వెంకటేశంను ఏసీబీ అధికారులు రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా గాజులరామారంకు చెందిన ఓ భూమి డెవలప్‌మెంట్ చేసేందుకు రత్నాకరం సాయిరాజు గతంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే సదరు భూమి విషయంలో సమీపంలో ఉన్న వారితో పాటు భూయజమానులకు జరిగిన ఘర్షణలు జరుగుతు న్నాయి. భూ ఆక్రమణల ఫిర్యాదులపై గతం లో కేసులు నమోదైయ్యాయి. ఇటీవల సద రు భూమిని డెవలప్‌మెంట్ చేసుకునేందుకు నిర్ణయించుకుని పనులను ప్రారంభించేందుకు రత్నాకరం సాయిరాజు ఏర్పాట్లు చేసుకున్నాడు.

అయితే పనులను చేసే క్రమంలో వెంకటేశం కల్పించుకుని పనులను చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని, రూ.5 లక్షలిచ్చి పనులు చేసుకోవాలని హుకుం జారీ చేశాడు. భూమిలో అభివృద్ధి పనులు చేసుకునేందుకు ఫేవర్ చేయాలని రత్నాకరం సీఐని వ్యక్తి అభ్యర్థించడంతో పాటు రూ.2 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడు. కానీ సదరు భూమిలో పని చేసేందుకు మరో రూ.5 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. చేసేదిలేక సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం సీఐ రూ.లక్ష తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సురేశ్ మాట్లాడుతూ వెంకటేశంను అదుపులోకి తీసుకుని అతని ఇంటితో పాటు బంధువుల ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిందితుడిని నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించిన ఏసీబీ అధికారులు కేసు విచారణ కొనసాగుతుందని తెలిపారు.