calender_icon.png 11 January, 2026 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ అధికారుల అవినీతి!

11-01-2026 12:05:33 AM

పాత గుంజలకు రూ.5 వేల డిమాండ్

ములుగు/వెంకటాపూర్, జనవరి 10 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో అటవీ శాఖ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి వద్ద ఉన్న పాత గుంజలతో పందిరి వేయడానికే డబ్బులు ఇవ్వాలం టూ అధికారులు డిమాండ్ చేయడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. మండల కేంద్రంలోని తాళ్లపాడు సెంటర్‌లో గునిగంటి రఘు.. మల్లన్న పట్నాల సందర్భంగా పందిరి వేసేందుకు సిద్ధమయ్యారు.

ఇంటి ముందు ఉన్న పాత గుంజలతో పందిరి ఏర్పాటు చేస్తుండగా, అటుగా వెళ్లిన అటవీ సెక్షన్, బీట్ అధికారులు గుంజల గురించి ప్రశ్నిస్తూ హం గామా చేశారు. గుంజలు పాతవేనని వివరించినప్పటికీ అధికారులు వినకుండా రూ. 5,000 చెల్లించాలని డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెడతామని హెచ్చరించారని ఆరోపించారు. ఈ ఘటనను చూసిన చుట్టుప క్కల వారు గుమిగూడగా,కొందరు తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారు తుందని భావించిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.