11-01-2026 12:00:00 AM
చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్
కుషాయిగూడ, జనవరి 10 (విజయక్రాంతి) : కుషాయిగూడ డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ కాలనీలో గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అధికారులకు ఆదేశించారు శనివారం సాయంకాలం కుషాయి గూడ డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ కాలనీని సందర్శించి ప్రజా సమస్యలను బొంతు శ్రీదేవి యాదవ్ అడిగి తెలుసుకున్నారు.
గణేష్ నగర్ కాలనీలో సీసీ రోడ్లు వీధిలైట్లు సీసీ రోడ్ల నిర్మాణం తదితర ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిహెచ్ ఎంసి మున్సిపల్ అధికారులను కోరింది ప్రజలు ఎలాంటి సమస్య ఉన్న తమను వచ్చి నేరుగా కలవాలని ఆమె గణేష్ నగర్ కాలనీవాసులను కోరింది. బొంతు శ్రీదేవితో పాటు గణేష్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాలకృష్ణ మాజీ అధ్యక్షు లు బంకు శ్రీనివాస్ తిరుపతమ్మ శిరీష డేవిడ్ వెంకన్న నరసింహారెడ్డి గణేష్ నగర్ కాలనీవాసులు మహిళలు ప్రజలు ఉన్నారు