11-01-2026 12:06:40 AM
బీజేపీ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల విక్రంరెడ్డి
మేడ్చల్ అర్బన్ జనవరి 10(విజయక్రాంతి): సోమనాథ్ ఆలయ నిర్మాణానికి 75 సంవత్సరాలు పురస్కరించుకొని బిజెపి గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షులు కావేరి శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో ‘స్వాభిమాన్ పర్వ్‘ పూజలు నిర్వ హిస్తునానమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర బిజెపి నాయకులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ సోమనాథ్ ఆలయం భారతీయ సంస్కృతి పట్టుదల ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపం భారతీయ వారసత్వ సంపదను కాపాడుకోవాలని ధర్మ రక్షణ జరగాలని ప్రత్యేక సంకల్పం చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి.బిజెపి మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, చింతలపూడి రామరావు బిజెపి సీనియర్ నాయకులు రవీందర్ గౌడ్, కిషన్, మహేష్, మధుసూదన్, సురేష్, నాగరాజ్, నవీన్, బండారి సురేష్, మహేష్, మధు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.