అవినీతి, అరాచక పాలన
ఇవే కాంగ్రెస్ ప్రభుత్వంలో జోడెడ్లు
ప్రజల విశ్వాసం గులాబీ జెండాపైనే
నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రానికి కావాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో గతంలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెడ్లలా ముందుకు సాగాయని, కానీ ప్రస్తుతం రాష్ట్ర పాలనలో అవినీతి, అరాచకం జోడెడ్లుగా మారాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చెక్ డ్యామ్‌లు పేల్చడం, పల్లె ప్ర కృతి వనాల్లో చెట్ల నరుకడం వంటి చర్యలు రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్నాయని అన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లను శుక్రవా రం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... అలంపూర్, ఐజ, గద్వాల, వడ్డేపల్లి ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు అందించిన మద్దతు విశేషమని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నడిగడ్డలో మాత్రం ప్రజల విశ్వాసం ఇప్పటికీ బీఆర్‌ఎస్ పైనే ఉందని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు మెజారిటీ స్థానా లు గెలుచుకో వడం పార్టీ బ లాన్ని నిరూపిస్తోందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. నాగర్ కర్నూల్‌లో రెండు నెలల పాప మరణ ఘటన, కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ వంటి ఘటనలు ప్రభు త్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలు ప్రజలను రో డ్డున పడేసిన దారుణ చర్యలని ఆక్షేపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యా రెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చే యలేదని, రైతు బంధు, ఎరువుల సరఫరా వం టి అంశాల్లో రైతులను తీవ్రంగా నిరాశపరిచిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ నిజ స్వరూపం అర్థమైందన్నారు. నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం వ్యాపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామిరెడ్డి ప్రజల సమస్యలపై అంకితభావంతో పనిచేసే నాయకు డని, ఎమ్మెల్యే విజయుడు కూడా అదే తత్వాన్ని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తుందని ముందుగానే హెచ్చరిం చిన కేటీఆర్‌కేటీఆర్, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోసారి కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.




