ఇండ్లను కూల్చడంలో కాంగ్రెస్ పోటీ
- రేవంత్‌రెడ్డి పనితీరు మారకపోతే ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారు
- వెలుగుమట్ల ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపాటు
కరీంనగర్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ప్రధాని మోదీ ఆవాస్ యోజన కింద దేశ ంలో పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇచ్చే విషయంలో పోటీ పడుతుంటే రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చే విషయంలో పోటీ పడుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. శుక్రవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం వెలుగుమట్లలో పేదలు కష్టాలు పడి ఇండ్లు కట్టుకుంటే వాటిని కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి పనితీరు మారకపోతే ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారని హెచ్చరించా రు. కాగా కరీంనగర్ లోని 51వ డివి జన్ లో 16 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒక్కటేనని విమర్శించారు.
తక్షణమే రైతు భరోసా ఇవ్వాలి
రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని, తక్షణమే రైతు భరోసా సొమ్మును రైతుల ఖాతా ల్లో జమ చేయాలని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశా రు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. యాసంగి మొదలై రెండు నెలలైనా రైతు భరోసా సొమ్ము జమ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికలైన వెంటనే వేస్తామని ఈ నెల 4న మిర్యాలగూడ సభ లో సీఎం ప్రకటించారని, ఇచ్చిన మాటను విస్మరిస్తే ఎలా అని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మందికిపైగా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని, రెండు విడతల రైతు భరో సా సొమ్ము చెల్లించాలన్నారు. మూడో విడతతో కలిపి 27 వేల కోట్లు బకాయిలివ్వాల న్నారు. లేదంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని లేఖలో హెచ్చరించారు.




