5 August, 2026 | 10:22 AM

రవాణా విభాగంలో అవినీతి!

03-09-2025 12:00 AM
  1. జీహెఎంసీ ఉద్యోగులు ఆడిందే ఆట, పాడిందే పాట
  2. దశాబ్దాలుగా ఒకే చోట పాతుకుపోయిన వైనం
  3.   30 ఏళ్లుగా ఒకేచోట తిష్టవేసిన ఫోర్‌మెన్లు
  4. బోగస్ ఇండెంట్లు, స్పేర్‌పార్ట్స్ స్కామ్‌లతో ఖజానాకు కన్నం

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): జీహెఎంసీలో రవాణా విభా గం అవినీతికి అడ్డాగా అడ్రస్‌గా మారింది. సమర్థులైన ఐఏఎస్ అధికారులు కమిషనర్లుగా వస్తున్నా ఈ ఒక్క విభాగాన్ని మాత్రం గాడిలో పెట్టలేకపోతున్నారు. ఇది కమిషనర్ కారు నుంచి చెత్త తరలించే లారీల వరకు.. అధికారుల అద్దె వాహనాల నుంచి పాలకమండలి ఎస్కార్ట్ వాహనాల వరకు విస్తరిం చిన పెద్ద సామ్రాజ్యం.

ఇక్కడ నైపుణ్యం కంటే, పైఅధికారులను, రాజకీయ నాయకులను మేనేజ్ చేసే నేర్పుకే పెద్దపీట. ఫలితంగా, కొం దరు సిబ్బంది దశాబ్దాలుగా ఒకేచోట పాతుకుపోయి, ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకుం టున్నారు. జీహెఎంసీలోని ఇతర విభాగాల్లో మూడేళ్లకో, ఐదేళ్లకో బదిలీలు అవుతాయి. కానీ రవాణా విభాగానికి మాత్రం ఈ నిబంధన వర్తించదు. ఇక్కడి సిబ్బందికి బదిలీ అనే మాటే తెలియదు.

ముఖ్యంగా అతిపెద్ద రవాణా యార్డు అయిన కవాడిగూడలో కొం దరు ఫోర్‌మెన్లు నియామకం అయినప్పటి నుంచి అంటే, దాదాపు మూడు దశాబ్దాలుగా అక్కడే తిష్ట వేశారు. దీంతో వారు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, ఇష్టారాజ్యంగా బోగస్ ఇండెంట్లు సృష్టిస్తూ, స్పేర్ పార్ట్స్ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడుతూ ఖజానా కు గండి కొడుతున్నారు. గతంలో స్పేర్ పార్ట్స్ స్కామ్‌లో దొరికిన ఓ ఫోర్‌మెన్, తన కింది స్థాయి ఉద్యోగిని బలిపశువును చేసి తాను తప్పించుకున్నా డు.

ఆశ్చర్యకరంగా, కొద్ది రోజుల క్రితమే పాలకమండలిలోని ఓ కీలక వ్యక్తికి లక్షల్లో మామూళ్లు సమర్పించుకొని, మళ్లీ అదే కవాడిగూడ పోస్టింగ్‌ను దక్కించుకున్నాడంటే పరిస్థితి ఎం త దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ ఉద్యోగి 1992, మే 16న ఫోర్‌మెన్‌గా విధుల్లో చేరారు. 2033 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉంది.

నియామకం నుంచి రిటైర్మెంట్ వరకు సుమా రు 41 ఏళ్ల సర్వీసులో ఒక్క బదిలీ, కనీసం ఒక్క పదోన్నతి కూడా లేకుండా ఒకే సీటులో కొనసాగుతున్నారు. గతంలో కమిషనర్‌గా పనిచే సిన ఇలంబర్తి, శానిటేషన్ విభాగంలో ఏళ్లుగా పాతుకుపోయిన జవాన్లను బదిలీ చేసి సంచలనం సృష్టించినా, ఆయన దృష్టి రవాణా చక్రబంధంపై పడకపోవడం గమనార్హం.

కార్ల అద్దె బిల్లులు దండుకుంటున్నరు

మోటారు వాహన చట్టం ప్రకా రం, ప్రభుత్వానికి అద్దెకు తిరిగే వాహనానికి పసుపు రంగు నంబర్ ప్లేట్ ట్యాక్సీ ప్లేట్ తప్పనిసరి. కానీ జీహెఎంసీలో కొందరు అధికారులు తమ సొంత తెల్ల ప్లేట్ వాహనాలను వినియోగిస్తూ, నెలా నెలా అద్దె బిల్లులు దండుకుంటున్నారు. మరికొందరు ఘనులు తాము ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ, కారు వాడినట్లు బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్ర స్తుత కమిషనర్ కర్ణన్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి, రవాణా విభాగంలో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేయాలని, దశాబ్దాలుగా తిష్ట వేసిన వారిని బదిలీ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బల్ది యాలోని నిజాయితీపరులైన ఉద్యోగులు, సిబ్బంది కోరుతున్నారు.