5 August, 2026 | 9:31 AM

వినాయక నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

03-09-2025 12:00 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): భక్తులు వినాయక నిమజ్జనాన్ని నిరాటంకంగా, ఆనందోత్సవాలతో జరుపుకునేందుకు భక్తులు అధికారులు సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవారం రోజు జిల్లా భువనగిరి పట్టణ శివారు లోని పెద్ద చెరువు వద్ద గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్. పెద్ద చెరువు వద్ద విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

చెరువులో నీటిమట్టం పెరిగిన దృశ్య భక్తుల భద్రతకు ప్రాధాన్యతీ భారీ కేడింగ్ పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు చెరువు వద్ద క్రేన్లు, లైటింగ్, శానిటేషన్, త్రాగునీరు వైద్య సదుపాయాలు టాయిలెట్లు అన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు.  నిమర్జనానికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. 

నిమజ్జనం అనంతరం బతుకమ్మ పండుగ ని దృష్టిలో పెట్టుకుని చెరువు వద్ద ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఎలాంటి ఏర్పాట్లు చేయక పోతే చాలా ఇబ్బందులు పడతారని తెలిసి ఈ సారి ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రామలింగం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.