calender_icon.png 20 February, 2026 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర పెంచాలని పత్తి రైతుల ఆందోళన

20-02-2026 12:00:00 AM

పెద్దపల్లి, (విజయక్రాంతి) :పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. ఒక్క రోజు వ్యవధి లోనే క్వింటాల్ పత్తికి దాదాపు రూ.2,500 తక్కువ పలకడంతో రైతులు ఆందోళన నిర్వహించారు. ధర పెంచాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు.

సమాచారం అందుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి ఆందోళనను విరమింప జేశారు.అనంతరం డీఎంఓ ప్రవీణ్ రెడ్డి అధ్య ర్యంలో జిన్నింగ్ మిల్లర్లు, ఆర్తి దారులతో సమావేశమై మరోసారి ధర లు సవరించాలని సూచించా రు. దీంతో పత్తి కొనుగోళ్లు యథావిదిగా సాగాయి.