10 March, 2026 | 1:27 PM

మండలి భవనం ప్రారంభం

09-03-2026 02:55 AM

ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి) : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనమండలిని అత్యాధునిక హంగులతో పున ర్నిర్మించగా.. మేళ తాళాల మధ్య సీఎం రే వంత్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండలిలో పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. వారసత్వ సంపదకు చిహ్నమైన తెలంగాణ పాత అసెంబ్లీ హాలును కొత్త హంగులతో ముస్తాబు చేశారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మండలి వైఎస్ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, దాసోజ్ శ్రవణ్, బల్మూరు వెంకట్,  శాసన మండలి, అసెంబ్లీ, కార్యదర్శులు నరసింహాచార్యులు, తిరుపతి పాల్గొన్నారు.