11 March, 2026 | 2:06 AM

మున్నూరు కాపుల అభివృద్ధికి కౌన్సిలర్లు కృషి చేయాలి

10-03-2026 09:20 PM

జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు

జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో  కౌన్సిలర్లకు సన్మానం

కామారెడ్డి,(విజయక్రాంతి): మున్నూరు కాపు ల అభివృద్ధికి మున్నూరు కాపు కౌన్సిలర్ లు కృషి చేయాలని జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల కామారెడ్డి మున్సిపల్ లో మున్నూరు కాపు కులానికి చెందిన కౌన్సిలర్లు గెలుపొందడంతో వారిని జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మానించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మున్నూరు కాపు సంఘ o అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసరావు మాట్లాడారు.

కామారెడ్డి మున్సిపల్ లో మున్నూరు కాపు కులానికి చెందిన ఎనిమిది మంది  కౌన్సిలర్లు  గెలుపొందారు, కామారెడ్డి పట్టణం వివిధ వార్డుల్లో ఆయా పార్టీల నుంచి గెలుపొందిన మున్నూరుకాపు సామాజిక వర్గం కౌన్సిలర్లు కాసర్ల మాధవి, ఆకుల సుజిత, లోలం శ్రీనివాస్, రాంశెట్టి హర్షిత, కాసర్ల గోదావరి, గోపు బాలమణి, మామిండ్ల లక్ష్మణ్, కాసర్ల రాణిలు జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వరంలో  ఘనంగా సన్మానించారు.

కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 49 వార్డుల్లో 9 మంది మున్నూరు కాపు కులానికి చెందిన కౌన్సిలర్లు గెలుపొందడం హర్షనీయమని అన్నారు, ప్రజల్లో సేవభావం కల్గినవారితో పాటు బీసీలను గెలుపించడం మార్పుకు కారణమని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాసరావు, పెట్టుగాడి అంజయ్యలు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు గాండ్ల వెంకటరాజు, కాసర్ల శ్రీనివాస్, కాసర్ల స్వామి, రవీందర్, ఆకుల భరత్ కుమార్, గోపు నర్సింలు, రాంశెట్టి భూపతి తదితరులు పాల్గొన్నారు.