25 June, 2026 | 4:40 AM

అందరికీ అక్షరజ్ఞానం

14-06-2024 01:40 AM
  • కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల, జూన్ 13 (విజయక్రాంతి): అందరికీ అక్షరజ్ఞానం అందించాలన్న ఆలోచనతోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సర్కాలు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నదని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. గురువారం జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల, మల్యాల మండల కేంద్రాల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమాలను కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలను  చొప్పదండి ఎమ్మెల్యేతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సాధికారతలో భాగంగా అమ్మ ఆదర కమిటీలకు పాఠశాలల నిర్వహణను అప్పగించినట్లు తెలిపారు.

మహిళల భాగసామ్యంతో పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. అందుకు నిదరనం కేవలం 20 రోజుల్లోనే మహిళా సంఘాల సభ్యులు పిల్లలకు యూనిఫాంలు కుట్టించడమని చెప్పారు. ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన చేసి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో సంపత్‌రావు, డీపీవో దేవరాజ్, డీఈవో జగన్‌మోహన్‌రెడి పాల్గొన్నారు.

కోరుట్ల పట్టణంలో

కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని ఎకిన్‌పూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో బడిబాట కార్యక్రమాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కలకుంట్ల సంజయ్, అదనపు కలెక్టర్ రాంబాబు ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ  చేశారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో ఆనంద్‌కుమార్, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, ఎంపీపీ తోట నారాయణ, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, ఎంఈవో గంగుల నరేశం,  కౌన్సిలర్ బద్ది సుజాత పాల్గొన్నారు.