27 July, 2026 | 6:56 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

27-07-2026 06:20 PM

మఠంపల్లి,(విజయ క్రాంతి): ఎల్ నినోను  ఎదుర్కొనేందుకు  ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు వ్యవసాయ అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా  మఠంపల్లి మండల సిపిఐ కార్యదర్శి అమరారపు పున్నయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యంతో కలసి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను ఆదుకోవాలని, ఎల్ నినో ప్రభావం వల్ల మెట్ట పంటలు వేసుకునే రైతులకు ఎకరానికి 8000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి రైతులను ఆదుకోవాలి.

ఎల్ నినో ప్రభావం వల్ల రానున్న రోజుల్లో తాగు, సాగునీటి ఎద్దడి గురించి ఇప్పటివరకు నిర్దిష్టమైన చర్యలు తీసుకొని ప్రమాదాలు అరికట్టాలని లోటు వర్షపాతంతో ఖరీఫ్ కుదేలయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని తాగునీటి కూడా కటకటగా ఉండే పరిస్థితి ఏర్పడనున్నదని  ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సగానికి సగం వరి సాగు తగ్గిపోయిందని అందువల్ల గ్రాముల ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు విస్తృతంగా పర్యటించి భూగర్భ జలాల పరిస్థితి అంచనా వేసి రైతులకు తగు సూచనలు ఇవ్వాలని కోరారు.