27 July, 2026 | 6:56 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి

27-07-2026 06:23 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): విద్యాబోధనలో నూతన విధానాలను అవలంబించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని మల్లాపూర్ మండల విద్యాధికారి (ఎంఈఓ) దామోదర్ రెడ్డి సూచించారు. సోమవారం మల్లాపూర్ మండలం రాఘవపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల వృత్త్యాంతర శిక్షణ (ఇన్-సర్వీస్ ట్రైనింగ్) తరగతులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న బోధనా పద్ధతులు, నైపుణ్యాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించేలా ఆధునిక బోధనా విధానాలను అనుసరించాలని, ప్రతి విద్యార్థి అభ్యాస ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, శిక్షకులు పాల్గొన్నారు.