27 July, 2026 | 6:56 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి

27-07-2026 06:21 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని యూనియన్ బ్యాంకులో హిందీ భాష మాత్రమే తెలిసిన ఉద్యోగులు విధులు నిర్వహించడం వల్ల మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భాషా సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు.ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సోమవారం యూనియన్ బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు.

స్థానిక ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగు భాషలో మాట్లాడగలిగే ఉద్యోగులను తక్షణమే నియమించాలని వారు డిమాండ్ చేశారు.తెలుగు తెలియకపోవడం వల్ల ఖాతాదారులు బ్యాంకు లావాదేవీలు నిర్వహించడంలో ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా వృద్ధులు, రైతులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏనుగు లక్ష్మి, అల్లె లత, కదుర్క లక్ష్మి, ముష్కరి రమేష్, మొరపు లక్ష్మి, ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.