27 July, 2026 | 6:42 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి

27-07-2026 06:11 PM

మఠంపల్లి,(విజయ క్రాంతి): మఠంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ రవి,ఎంపీడీవో సుమంత్, తాహశీల్దార్ హిమబిందు,మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో  ఎల్ నీనో లో ప్రభావం వల్ల వర్ష భావ పరిస్థితుల్లో దృష్ట్యా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా అరుతడి పంటలైన కందులు పెసలు, మినుములు, జొన్నలు వేరుశనగలు, ఉద్యాన పంటలైనటువంటి కూరగాయలు పండ్లు పూల తోటలు మునగ తోటలు,ఆయిల్ పామ్ పంటలు వేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ... ఈ ప్రత్యామ్నాయ పంటలకు ఉద్యానవన  శాఖ నుంచి అందిస్తున్నటువంటి వివిధ రకాల రాయితీ పథకాల గురించి వివరించడం జరిగింది. కూరగాయ పందిరిలకు,డ్రిప్పు, స్ప్లింక్లర్స్ కు, కూరగాయ విత్తనాలకు  నారుకు అందిస్తున్న వివిధ రకాల రాయితీలను ఉపయోగించుకొని అధిక దిగుబడులు పొందవలని కోరారు.అలాగే వి.బి.జి రామ్జి పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు , ఫామ్ పాంట్స్, బోర్ వెల్స్, ఓపెన్ వెల్స్ లకు సంబంధించిన పథకాలను గ్రామస్థాయిలో తీర్మానం చేసి ఉపయోగించుకోవాలి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఇఓ లు,మండల అన్ని డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.