17 June, 2026 | 1:08 AM

శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు

17-06-2026 12:00 AM

ఎర్రుపాలెం జూన్ 16 (విజయ క్రాంతి): చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయాన్ని మంగళవానాడు లెక్కించారు. ఖమ్మం జిల్లా దేవాదాయ పరిశీలకులు ఏ రత్నప్రభ ఆధ్వర్యంలో, దేవస్థానం ఈవో కొత్తూరు జగన్మోహన్రావు పర్యవేక్షణలో 92 రోజుల శ్రీవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు.

మొత్తం ఆదాయం 52 లక్షల 95 వేల 430 రూపాయలు వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ఉప్పల విజయ దేవర శర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్ శర్మ, దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ డి సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణ ప్రసాద్, ఆలయ సిబ్బంది, సత్య సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.