17 June, 2026 | 1:04 AM

పెద్దమ్మగుడి నూతన ఈఓగా ఎ.విజయకుమార్

17-06-2026 12:00 AM

పాల్వంచ, జూన్ 16 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని జగన్నాధపురం పెద్దమ్మగుడి నూతన ఈవో గా ఏ విజయ్ కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు.  దేవాదాయశాఖ, హైద్రాబాద్ వారి, ఉత్తర్వుల ప్రకారం శ్రీ భద్రకాళి దేవస్థానం, వరంగల్ సందు సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తించుచున్న, అద్దెంకి విజయ్కుమార్  పదన్నోతిపై కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి) సందు కార్యనిర్వహణాధికారి, గ్రేడ్-1గా బాధ్యతలు స్వీకరించారు. ముందు గా ఆలయ అర్చకులు , సిబ్బంది స్వాగతం పలికి దేవాలయంలో పూజలు జరిపిన పిదప,అర్చకులు నూతన కార్యనిర్వహణాధికారి కు వేదాశీర్వచనం గావించారు.