26 June, 2026 | 1:49 AM

గణేష్ గడ్డ దేవస్థానం హుండీ లెక్కింపు

26-06-2026 12:00 AM

పటాన్‌చెరు, జూన్ 25: పటాన్చెరు మం డలం రుద్రారం గ్రామం శ్రీ గణేష్గడ్డ దేవాలయంలో శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. 97 రోజులకు హుండీ ఆదాయం 29,72,351 రూపాయలు, అన్నదానం హుండీ ఆదాయం 1,54,838  రూపాయలు వచ్చినట్టు ఆలయ ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్రెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపులో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వి రంగారావు, పాలకమండలి సభ్యులు రుక్మారెడ్డి, నరసింహ గౌడ్, మధుసూదన్ రెడ్డి, భక్తులు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.