28 August, 2026 | 2:10 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

రాశి వనాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి

26-06-2026 12:00 AM

వాకింగ్ అసోసియన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన పైడి ఎల్లారెడ్డి 

వాకర్స్ ట్రాక్  ఏర్పాటుకు హామీ

అభినందనలు తెలిపిన వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

కామారెడ్డి, జూన్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని రాశివనంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు సుధాకర్ రావు, డాక్టర్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పైడి ఎల్లారెడ్డిని రాశి వనంలో వాకర్స్ ట్రాక్, సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరడంతో సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రాశి వనంలో వాకర్స్ ట్రాక్, సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పైడి ఎల్లారెడ్డిని అభినందించారు. మార్నింగ్ వాకర్స్ తో వాక్ చేసి వారితో ముచ్చటించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ఆవరణలో వాకర్స్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హారాలే సుధాకర్ రావు, ఆర్కే కళాశాల గ్రూప్ చైర్మన్ డాక్టర్ జైపాల్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాజేశ్వరరావు, లక్ష్మీనారాయణ, రాజిరెడ్డి, గంగారెడ్డి, సంతోష్, భూపతి, తదితరులు  పాల్గొన్నారు.