15 April, 2026 | 3:16 AM

ప్రపంచ దేశాలు అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నాయి

15-04-2026 12:00 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు 

సుల్తానాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): ప్రపంచ దేశాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుంటున్నాయని ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలోని అన్ని వర్గాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. వారు రాసిన రాజ్యాంగం ద్వారానే మనం అనుభవిస్తున్న రిజర్వేషన్లు అని అన్నారు..

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ న్యాతరి ప్రభాకర్ , నాయకులు కన్నూరి ప్రభాకర్, న్యాతరి శ్రీనివాస్, సంకనపల్లి లక్ష్మణ్ , చిలక రాజేశం , ఆరేపల్లి రాహుల్ , రాకేష్ , క్యాదాసి చంద్రమౌళి, ఊట్ల వర ప్రదీప్ , వరప్రసాద్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, బిజెపి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి , కమిషనర్ రమేష్ , తాసిల్దార్ బసిరుద్దీన్ , మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య , కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.