11 June, 2026 | 2:32 AM

మానవ్ సుతార్‌కు కౌంటీ ఆఫర్

11-06-2026 01:05 AM

యువ స్పిన్నర్‌తో వార్విక్‌షైర్ ఒప్పందం

ముంబై, జూన్ 10: భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌కు ఊహించని అవకాశం దక్కింది. ఆప్ఘనిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్‌తో అరంగేట్రంలోనే అదరగొట్టిన సుతార్ కౌంటీ క్రికె ట్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మానవ్ సు తార్‌తో ప్రముఖ కౌంటీ జట్టు వార్విక్‌షైర్ ఒప్పందం చేసుకుంది. సుతార్ రెండు మ్యా చ్‌లు ఆ జట్టు తరపున ఆడబోతున్నాడు. అతని అంతర్జాతీయ కెరీర్‌కు కౌంటీ అనుభవం చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.

ఎందుకంటే స్పిన్నర్లకు పెద్దగా స హకరించని ఇంగ్లాండ్ పిచ్‌లపై ఈ యువ ఆటగాడు తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవచ్చు. ఇంగ్లీష్ కౌంటీల్లో రాణిస్తే మానవ్ సుతార్ భవిష్యత్తుకు తిరుగుండదని అంచ నా వేస్తున్నారు. అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత జడేజా మాత్రమే జట్టులో కీలక స్పిన్నర్‌గా ఉన్నాడు. అయితే జడ్డూ కూడా రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న నేపథ్యంలో భారత్‌కు విదేశీ గడ్డపై నాణ్యమైన స్పిన్నర్ అవసరం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డున్న సుతార్ ఆఫ్ఘనిస్థాన్‌పై టెస్టుల్లో అడుగు పెట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గానూ ఎంపికయ్యాడు. ప్రస్తుతం సుతార్‌ను జడేజా వారసునిగా అంచనా వేస్తున్నారు.